అన్నదాతకు అండగా... అద్భుత కథాంశంతో సినిమా... టీజర్ అదుర్స్
దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టిన సమయంలో వారికి యావత్ దేశం మద్దతు పలికింది.
దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమబాట పట్టిన సమయంలో వారికి యావత్ దేశం మద్దతు పలికింది. తన శరీరంపై కూడా ద్యాస లేకుండా ఆరుగాలాలు కష్టపడుతూ కంటికి రెప్పలా కాపాడి పంట పండిస్తే... ఆ అన్నదాతకు దక్కాల్సిన ప్రతిఫలం దళారులు, కార్పోరేట్ శక్తులు దోచుకుంటున్నాయి. ఇలా అన్నధాతలు దోపిడీకి గురవుతున్నా అటు రాష్ట్రం, ఇటు కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకున్న పాపన పోవడం లేదు. అందుకే రైతన్నలు తమ హక్కుల కోసం, న్యాయం కోసం రోడ్డెక్కగా వారికి అన్నివర్గాల నుండి మద్దతు లభిస్తోంది. తాజాగా తెలుగు సినీ వర్గాలు కూడా ఒక్కొక్కరుగా రైతులకు మద్దతుగా ముందుకు వస్తున్నారు. అన్నధాతలు, వ్యవసాయం నేపథ్యంలో హిమ మీడియా వర్స్స్, విలేజ్ ఫిల్మ్ కార్పొరేషన్స్ సంయుక్తంగా రూపొందించిన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన టీజర్ ను విడుదలచేసింది. ఇందులో రైతన్నకు మద్దతిస్తూ ఉపయోగించిన డైలాగ్ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేస్తోంది. జర్నలిస్ట్‌గా వివిధ శాఖల్లో పనిచేసిన అంజన్ రెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. శుభలేక సుధాకర్ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రంలో శ్రీ మానస్, వరుణ్ ఆర్లా హీరోలుగా నటిస్టున్నారు. మరినా సింగ్, సహారా క్రిష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితో పాటు బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా, పద్మ జయంతి, మది ఇతర పాత్రల్లో నటించారు. నవీన్ పొట్లూరి సినిమాటోగ్రఫీ అందించగ,ఎడిటర్: చిన్నం వెంకట్, మిహిరాంశ్ సంగీతం అందించారు.కో డైరెక్టర్ : చావా రమేశ్.