అంబరాన్ని అంటిన నిహారిక, చైతన్య మ్యారేజ్ సెలబ్రేషన్
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది.
నటుడు నాగబాబు కుమార్తె నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్ రావు తనయుడు చైతన్యతో బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో డెస్టినేషన్ మ్యారేజ్ తరహాలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఇందులో థిక్ పింక్ కలర్ డిజైనింగ్ వేర్‌లో చైతన్య, గోల్డెన్ కలర్ శారీలో మెరిసింది. కనువిందుగా జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ సందడి చేసింది. ఆద్యంతం కనువిందుగా, మెస్మరైజింగ్‌గా నిహారిక, చైతన్యల వివాహం జరిగింది. ఇందులో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, సాయితేజ్, ఉపాసన, శిరీష్, స్నేహారెడ్డితోపాటు ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులు పాల్గొన్నారు. పవన్ తనయుడు అకీరా స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.