Asianet News TeluguAsianet News Telugu

నాగశౌర్య NS20 ఫస్ట్ లుక్.. ఇంతలా ఊహించలేదన్న శేఖర్ కమ్ముల..

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో నాగ శౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.

First Published Jul 27, 2020, 11:13 AM IST | Last Updated Jul 27, 2020, 11:13 AM IST

నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్‌లో నాగ శౌర్య హీరోగా వస్తున్న సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యింది. దీన్ని దీనిమీద ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ నాగశౌర్యకు అభినందనలు తెలిపారు. నాగశౌర్య ఎంచుకుంటున్న సినిమాలు మంచి ప్రయాణం అని కితాబునిచ్చారు. ప్రాచీన క్రీడా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో నాగశౌర్య కండలు తిరిగిన దేహం, బ్యాక్ సైడ్ లుక్ అన్నీ అదిరిపోయాయి. ఈ సినిమాకు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించగా, రామ్ రెడ్డి కెమెరామెన్‌గా పని చేస్తున్నాడు. కాల భైరవ సంగీతాన్ని అందిస్తుండగా.. జునైడ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.