భ్రమరాంబ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ... బాలయ్యను అక్కడ చూసిన ఫ్యాన్స్ హంగామా చూడండి...
Veera Simha Reddy: సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ఈ రోజే విడుదలైంది.
Veera Simha Reddy: సంక్రాంతి కానుకగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి మూవీ ఈ రోజే విడుదలైంది. ఈ సినిమా థియేటర్ల వద్ద అర్థరాత్రి నుంచే బాలయ్య అభిమానులు హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఆ సినిమా విడుదల సందర్భంగా నందమూరి నటసింహం తన యూనిట్ తో కలిసి కూకట్‌పల్లి బ్రమరాంబ థియేటర్ కు వచ్చి సందడి చేసారు..బాలకృష్ణను అక్కడ చూసిన అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. డాన్సులు, వాయిద్యాలతో అక్కడ చేసిన హంగామా మామూలుగా లేదు. జై బాలయ్య నినాదాలతో థియేటర్ పరిసరాలు హోరెత్తిపోయాయి..ఆ హడావుడి ఏంటో మీరూ ఒక లుక్కేయండి...