ఏపీలో మద్యపాన నిషేధం కాదు నియంత్రణే... అసెంబ్లీ దారిలో వైసిపి ఎంపీ ప్లెక్సీ
అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి పార్టీ మద్యపాన నిషేద హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. \
అమరావతి: గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసిపి పార్టీ మద్యపాన నిషేద హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఈ హామీ మాత్రం అమలవ్వడం లేదు. ఇప్పుడు ఈ మద్యపాన నిషేదం కాస్తా మద్యపాన నియంత్రణగా మారింది. ఏపీ అసెంబ్లీకి వెళ్లే దారిలోని ఉండవల్లి కరకట్టపై సీఎం జగన్, ఎక్సైజ్ మంత్రితో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఫోటోతో ఓ ప్లెక్సీ వెలిసింది. ఆ ప్లెక్సీలో మద్యపాన నిషేదం కాకుండా నియంత్రణ అని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.