కరీమున్నిసా కుమారుడికే ఎమ్మెల్సీ టికెట్... రుహుల్లాకు బీఫామ్ అందించిన సీఎం జగన్
అమరావతి: ఇటీవల మృతిచెందిన వైసిపి ఎమ్మెల్సీ కరీమున్నిసా స్థానంలో ఆమె తనయుడు మహ్మద్ రుహుల్లాను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
అమరావతి: ఇటీవల మృతిచెందిన వైసిపి ఎమ్మెల్సీ కరీమున్నిసా స్థానంలో ఆమె తనయుడు మహ్మద్ రుహుల్లాను ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ మేరకు ఇవాళ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, తండ్రి మహ్మద్ సలీమ్ తో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన రుహుల్లా సీఎం జగన్ చేతులమీదుగా కలిసి భీపామ్ అందుకున్నారు.
వైసిపి ఆవిర్భావం నుండి తనవెంటే వున్న విజయవాడకు చెందిన కరీమున్నిసాకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా జగన్ అవకాశం కల్పించారు. అయితే ఆమె ఇటీవల గుండెపోటుతో మరణించారు. దీంతో ఖాళీఅయిన ఎమ్మెల్సీ స్థానాన్ని ఆమె కుటుంబానికే కేటాయించారు సీఎం. కరీమున్నిసా ఐదుగురు కొడుకుల్లో ఒకరయిన రుహుల్లాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు సీఎం జగన్.