విదేశీ విద్యా దీవెన డబ్బులకోసం పడిగాపులు... సీఎం సొంత జిల్లా విద్యార్థుల పరిస్థితి ఇదీ..

అమరావతి: విదేశీ విద్యా దీవెన పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే బుధవారం రాత్రి ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన ఓ విద్యార్థి తల్లి మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే పోలీసుల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులపై తప్పుడు కేసులు పెట్టిస్తోందని... మరొకరు ఇలా నిరసన చేపట్టకుండా పోలీసులు పెట్టి ఇలాంటి పనులు చేయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు.  మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థిని విద్యార్థులు విదేశాల్లో చదుకోవడానికి వెళ్లారని... వారికి ఇంతవరకు విదేశీ విద్యా స్కాలర్ షిప్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు.  ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని... పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. నిరసన చేపట్టిన విద్యార్థుల తల్లిదండ్రులను టిడిపి నాయకులు కోవేలమూడి రవీంద్ర మద్దతుగా నిలిచారు. 

First Published Mar 31, 2022, 2:08 PM IST | Last Updated Mar 31, 2022, 2:08 PM IST