Asianet News TeluguAsianet News Telugu

సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన ఉపాద్యాయులు


తాడేపల్లి: 1998 డిఎస్సీ క్యాలిఫైడ్ ఉపాధ్యాయులు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి చేపట్టారు. 

Mar 30, 2021, 11:23 AM IST

తాడేపల్లి: 1998 డిఎస్సీ క్యాలిఫైడ్ ఉపాధ్యాయులు సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి చేపట్టారు. ఒక్కసారిగా క్యాంపు కార్యాలయంవైపు దూసుకువచ్చిన ఉపాద్యాయులను అడ్డుకున్న పోలీసులు అదుపులోకి తీసుకుని  మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇలా 60 మంది ఉపాద్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో జగన్ పాదయాత్రలో వుండగా తమ సమస్యను విన్నవించుకున్నామని... అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. 22 సంవత్సరాలుగా అన్యాయానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో పలు రకాల జీవోలు ఇచ్చి గందరగోళానికి గురి చేశారని... జివో 221 వల్ల నష్టపోయామన్నారు. కాబట్టి సీఎం జగన్ వెంటన్ స్పందించి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాద్యాయులు డిమాండ్ చేశారు.