బాబాయ్ గుండెపోటు ఫేక్... కల్తీ మద్యం మాత్రం నిజం..: ప్లకార్డ్ చేతబట్టి లోకేష్ నిరసన
అమరావతి: కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో వందలాదిమంది బలవుతున్నారంటూ... వైసిపి ప్రభుత్వమే ఇలాంటి ప్రమాదకర మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది.
అమరావతి: కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం వల్ల ఏపీలో వందలాదిమంది బలవుతున్నారంటూ... వైసిపి ప్రభుత్వమే ఇలాంటి ప్రమాదకర మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా అసెంబ్లీలోనూ, బయటా టిడిపి నిరసన చేపడుతోంది. గత ఐదు రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చేతబట్టి టిడిపి శాసనసభాపక్షం ఆందోళన చేపడుతోంది. ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆరో రోజు కూడా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. ''కోడికత్తి ఫెక్, సారా మరణాలు నిజం'', ''బాబాయి గుండెపోటు ఫేక్, కల్తీ మద్యం నిజం'' అని రాసివున్న ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలుపుతూ అసెంబ్లీకి చేరుకున్నారు టిడిపి సభ్యులు.