మద్యం నుండి డ్రగ్స్ వరకు అన్నీ జే బ్రాండే... ప్లకార్డులు చేతబట్టి నారా లోకేష్ నిరసన
అమరావతి: జంగారెడ్డిగూడెం మరణాలు ఏపీ అసెంబ్లీని అట్టుడికిస్తున్నాయి.
అమరావతి: జంగారెడ్డిగూడెం మరణాలు ఏపీ అసెంబ్లీని అట్టుడికిస్తున్నాయి. కల్తీ నాటుసారా తాగడం వల్లే ఈ మరణాలు సంభవించాయని టిడిపి ఆరోపిస్తోంది. దీనిపై చర్చించాలంటూ టిడిపి సభ్యులు డిమాండ్ చేస్తుండగా ప్రభుత్వం మాత్రం ఇవన్నీ సహజ మరణాలేనని చెబుతూ చర్చకు అనుమతించడం లేదు. దీంతో అసెంబ్లీలోనూ, బయట నిరసన తెలియజేస్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఇలా గత మూడురోజులుగా ప్లకార్డులు చేతబట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు టిడిపి సభ్యులు. నాలుగోరోజు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. నారా లోకేష్ తో పాటు ఇతర టిడిపి నాయకులు కల్తీసారా మరణాలు ప్రభుత్వ హత్యలే, జే బ్రాండ్ మద్యం వల్లే మరణాలు సంబవిస్తున్నాయంటూ ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు.