Asianet News TeluguAsianet News Telugu

టిడిపి నేత నరేంద్ర అరెస్ట్ ... సిఐడి కార్యాలయం వద్ద మాజీ మంత్రుల ఆందోళన

అమరావతి : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ను సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంపై టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి.

First Published Oct 13, 2022, 2:08 PM IST | Last Updated Oct 13, 2022, 2:08 PM IST

అమరావతి : ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర ను సిఐడి అధికారులు అరెస్ట్ చేయడంపై టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. నరేంద్ర అరెస్ట్ గురించి తెలిసిన వెంటనే మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, దేవినేని ఉమ తదితర కీలక నాయకులతో పాటు కార్యకర్తలు అదే రాత్రి సిఐడి కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. అరెస్ట్ చేసిన నరేంద్రను ఒక్కసారి తమకు చూపించాలని... అతడి మాట్లాడే అవకాశం కల్పించాలని టిడిపి నాయకులు పోలీసులను కోరారు. అందుకు సిఐడి అధికారులు అంగీకరించకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సిఐడి కార్యాలయం గేటు దగ్గరే టిడిపి నేతలు ఆందోళనకు దిగడంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు నల్లపాడు స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు.