సుగాలి ప్రీతి కేసు ఏంటి? ఎప్పటికి తేలుతుంది? పవన్‌ కళ్యాణ్‌ పట్టించుకోవడం లేదా? | Asianet Telugu

Galam Venkata Rao  | Published: Feb 18, 2025, 6:01 PM IST

Janasena Leader Bolisetty Satyanarayana on Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసు తెలుగు రాష్ట్రాలలో ఓ సంచలనం. 17.08.2017న 10వ తరగతి చదువుతున్న విద్యార్ధిని సుగాలి ప్రీతిని స్కూల్ హాస్టల్లో దా*రుణంగా మూకుమ్మడిగా అ*త్యాచారం చేసి చం*పేశారు. 28.05.2018న ఉన్న సైంటిఫిక్ ఆధారాలను ప్రక్కనపెట్టి దోషులను రక్షించేలా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చార్జిషీట్ దాఖలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసు అలసత్వంపై సుగాలి ప్రీతి తల్లి పార్వతి కోర్టును ఆశ్రయించారు. ఆమె అభ్యర్థన మేరకు సుగాలి ప్రీతి కేసు సిబిఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 28.05.2020న జీవో జారీ చేసింది. 23.02.2021న సిబిఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. అయితే కౌంటరు కాపీ పిటీషనర్ కు ఇవ్వలేదు. కోర్టులో అడిగితే అది రిటర్న్ అయిందని చెప్పారు. 13.02.2025న సీబీఐ కౌంటర్ నాలుగేళ్ల తర్వాత దాఖలు చేసింది. 90 రోజుల్లో పరిష్కరించాల్సిన పోక్సో కేసును దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా సాగదీస్తున్నారు. అయితే, సుగాలి ప్రీతి తల్లికి అండగా నిలిచి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో చెప్పినప్పటి నుంచీ ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసుపై పవన్ కళ్యాణ్ స్టాండ్, ఇతర అంశాలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ వివరణాత్మక వీడియో విడుదల చేశారు.

Read More...