గుంటూరు జిల్లాలో తల్లిదండ్రులను వర్షంలో బయటకు నెట్టిన కసాయి కొడుకు
పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలోచిన్న కొడుకు తల్లిదండ్రులను ఉంటున్న ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టి అమానుషంగా ప్రవర్తించాడు.
పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామంలోచిన్న కొడుకు తల్లిదండ్రులను ఉంటున్న ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టి అమానుషంగా ప్రవర్తించాడు. కన్నవారికి తోడపుట్టిన వారికి తెలియకుండా చిన్న కుమారుడు రామకృష్ణ ఆస్తులను రాయించుకున్నాడు. విషయం తెలుసుకున్న పెద్ద కొడుకు రామకృష్ణని నిలదీసి ఆస్తులు తెలియకుండా ఎందుకు తీసుకున్నావ్ అని గొడవ పడటంతో పెద్దల జోక్యంతో ఇరు కుటుంబాలు పోలీసులు ఆశ్రయించగా పోలీసులు గొడవ పడకుండా పెద్ద మనుషులు సమక్షంలో ఎవరి ఆస్తులు వాళ్ళు జాగ్రత్తగా పంచుకోవాలని హెచ్చరించి పంపిన అనంతరం నాపై కేసు పెడతారా అని చిన్న కొడుకు తల్లిదండ్రులను ఉంటున్న ఇంటి నుండి బయటకు వెళ్లగొట్టి అమానుషంగా ప్రవర్తించాడు.