Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో ఇసుక రవాణాకు బ్రేక్... మెరుపు సమ్మెకు దిగిన లారీ యజమానులు

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక లారీ యజమానుల మెరుపు సమ్మెకు దిగారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక లారీ యజమానుల మెరుపు సమ్మెకు దిగారు. అచ్చంపేట మండలం చింతపల్లి, అమరావతి ఇసుకరీచ్ లలో లోడింగ్ నిలిపివేసారు లారీల యజమానులు. ఇసుక లారీలపై యస్ఈబీ, పోలీస్ అధికారుల దాడులకు నిరసనగా సమ్మెకు దిగినట్లు లారీ యజమానులు తెలిపారు. కేవలం రెండు,మూడు టన్నులకు యస్ఈబీ అధికారుల వేలల్లో పెనాలిటీలు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. అలాగే రీచ్ లలో వేబ్రిడ్జీ ఏర్పాటు,వేబిల్ పై 24 గంటలకు వ్యాలిడిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలంటూ గుంటూరు జిల్లావ్యాప్తంగా లారీ యజమానులు మెరుపు సమ్మెకు దిగారు.