దళితుడి కాళ్లుచేతులు విరగ్గొట్టిన దళిత ఉపముఖ్యమంత్రి అనుచరుడు... లోకేష్ సీరియస్

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని నందనూరు పంచాయతీ పెద్దకంటిపల్లి గ్రామానికి చెందిన చంద్రన్ అనే దళితుడిపై జరిగిన దాడిని లోకేష్ ఖండించారు. దళిత డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి ప్రధాన అనుచరుడు ఈశ్వర్ రెడ్డి కేవలం పదివేలకోసం చంద్రన్ కాళ్లూ చేతులూ విరగ్గొట్టాడని లోకేష్ ఆరోపించారు. గతంలో అప్పుగా ఇచ్చిన ప‌దివేల రూపాయలు తిరిగివ్వలేదని చంద్ర‌న్ ని త‌న మామిడితోట‌కి ఎత్తుకెళ్లిన ఈశ్వ‌ర్‌రెడ్డి కాళ్లూ చేతులూ విరిగిపోయేంత దారుణంగా చితక్కొట్టాడని లోకేష్ తెలిపారు. దీంతో బాధితులైన ద‌ళితులు స్టేష‌న్‌లో ఫిర్యాదుచేస్తే పోలీసులు క‌నీసం ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదని...  ఈ ఘటనతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్...వైసీపీ ఆర్డ‌ర్‌లో ఉంద‌ని తేట‌తెల్లం అవుతోందని అని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
First Published Mar 1, 2022, 4:55 PM IST | Last Updated Mar 1, 2022, 4:55 PM IST