AP Assembly: ఇదేమైనా వైసీపీ ప్రభుత్వమా? మండలిలో నారా లోకేశ్ విశ్వరూపం | Asianet News Telugu
దళితులకు గుండు కొట్టించిన వారు, దళితులను చం*పి డోర్ డెలివరీలు చేసినవారు వైసీపీ వారేనని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శాసనమండలి సమావేశాల్లో ఆయన ప్రసంగించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసమే టీడీపీ, జనసేన రెండూ కలిసి ఎన్డీయేకు మద్దతు తెలిపాయని.. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తుందని ముందుగానే చెప్పామన్నారు. అధికారంలోకి రాగానే రూ.13వేల కోట్లు రాష్ట్రానికి తీసుకొచ్చామని తెలిపారు. అమరావతి, పోలవరానికి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని... విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడుకున్నామని వివరించారు.