దారుణం.. ఒంటరి బాలికపై.. యేడాదిగా ముగ్గురి అత్యాచారం...
విశాఖ జిల్లా యలమంచిలిలో ఓ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ జిల్లా యలమంచిలిలో ఓ దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు లేని ఓ 15 యేళ్ల బాలికను మాయమాటలు చెప్పి 55 యేళ్ల వ్యక్తి, 21 యేళ్ల వ్యక్తి, ఇంకో వ్యక్తి గత యేడాదిగా ఆ బాలిక మీద తరచుగా అత్యాచారానికి పాల్పడ్డారు. ముగ్గురు వ్యక్తులు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడ్డారు. తల్లిదండ్రులు చనిపోయిన ఈ బాలిక నాన్నమ్మ, తాతయ్యల పర్యవేక్షణలో ఉంది. వారిద్దరూ వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో ఒంటరిగా ఉన్న బాలికపై ఈ అఘాయిత్యం చేశారు. ఈ మధ్య బాలిక పొట్ట ఎత్తు అవుతుండడంతో నాన్నమ్మ ఆస్పత్రికి తీసుకువెళ్లగా షాకింగ్ విషయం బైటపడింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిందితుల మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నామని సి. ఐ నారాయణరావు అన్నారు.