రెండోపంటకు సాగునీటి ఇబ్బంది లేకుండా చూడాలి.. మేకపాటి గౌతమ్ రెడ్డి
పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు.
పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పర్యటించారు. రైతన్నలకు సాగునీరందించడమే లక్ష్యంగా మంత్రి పర్యటన సాంగింది. సోమశిల జలాశయం, నియోజకవర్గంలోని మండలాలలో ఉన్న చెరువులను ఆయన పరిశీలించారు.
రెండో పంటకు సాగునీటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం చేజర్ల చెరువును పరిశీలించిన మంత్రి మేకపాటి అనంతసాగరం మండలంలోని పడమటి కంభంపాడు నల్లచెరువులూ పరిశీలించారు.