Asianet News TeluguAsianet News Telugu

ఏపీ ప్రత్యేక హోదాకూ చంద్రబాబు వెన్నుపోటు...: మంత్రి కన్నబాబు సంచలనం

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కకుండా వెన్నుపోటు పొడిచింది మాజీ సీఎం చంద్రబాబు నాయుడేనని వ్యవసాయ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తుంటే కేంద్రంతో రాజీపడిన చంద్రబాబు ప్యాకేజీకి అంగీకరించారని మండిపడ్డారు. అలాంటిది ఆయన ఇప్పుడు తమపై మాట్లాడటం సిగ్గుచేటని కన్నబాబు అన్నారు. ఆనాడు ప్రధాని మోదీ, సీఎంగా వున్న చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కలిసి తిరుపతి సభలో ఏపీకి 15 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇప్పిస్తామని చెప్పారని గుర్తుచేసారు. కానీ హోదాను ఇచ్చింది లేదు తెచ్చింది లేదు. కానీ వైసిపి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్దితో పనిచేస్తోందని... ఎంపీలతో రాజీనామా చేయించిన చరిత్ర తమదని కన్నబాబు పేర్కొన్నారు

First Published Feb 15, 2022, 5:29 PM IST | Last Updated Feb 15, 2022, 5:29 PM IST