పవన్ కల్యాణ్ చేస్తున్నది రాజకీయం కాదు... రాజకీయ వ్యభిచారం: మంత్రి దాడిశెట్టి రాజా సంచలనం

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు.

First Published May 9, 2022, 9:59 AM IST | Last Updated May 9, 2022, 9:59 AM IST

అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్. టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు పై మంత్రి దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబుతో కలిసిపోడానికి పవన్ తహతహలాడుతున్నాడని...
ఇదంతా ఓ పథకం ప్రకారమే జరుగుతుందన్నారు. ముందు పవన్ తో అనిపించి ఆ తర్వాత చంద్రబాబు అన్నాడని... అయితే గతంలో టీడీపీతో పొత్తు ఉండదని పవన్ చెప్పినమాటలు మర్చిపోయాడెమో అన్నారు. చంద్రబాబు పిలుపు కోసం చూస్తున్నా అంటున్న పవన్ కి సిగ్గుందా అంటూ మంత్రి మండిపడ్డారు.  

రాజకీయాల్లో పవన్ కి సిద్దాంతం అంటూ లేదన్నారు. చంద్రబాబు కలిసి పవన్ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారన్నారు. ఇన్ని పార్టీలతో పొత్తుల డ్రామాలు ఆడే ఏకైన పార్టీ జనసేన అని అన్నారు. అయితే ఎంత మంది కలిసినా జగన్ సింగిల్ గానే ఉంటారని... ప్రజలు ఆయన వెంటే ఉన్నారని మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు.