Asianet News TeluguAsianet News Telugu

టిక్ టాక్ చేస్తూ వివాహిత ఉరి !?.. విశాఖలో విషాదం...

విశాఖ జిల్లా పెందుర్తి లో లెంక ఆశ అనే వివాహిత ఉరివేసుకుని చనిపోయింది.భర్త శ్రీనివాసరావు ఆర్మీలో పనిచేస్తున్నాడు. 

విశాఖ జిల్లా పెందుర్తి లో లెంక ఆశ అనే వివాహిత ఉరివేసుకుని చనిపోయింది.భర్త శ్రీనివాసరావు ఆర్మీలో పనిచేస్తున్నాడు. వీరికి మైథిలి, ప్రణతి అని ఇద్దరమ్మాయిలు. అల్లుడు చాలామంచివాడని అమ్మాయిని చాలా బాగా చూసుకునేవాడని ఆశ తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆశకు ఎలాంటి సమస్యలూ లేవని, అందరికీ ధైర్యం చెప్పేదని తల్లీ, చెల్లి అంటున్నారు. విశాక గ్యాస్ లీక్ ఘటనతో పిల్లలను తీసుకుని తల్లిగారింటికి వచ్చిన ఆశ రెండు రోజుల క్రితమే పెందుర్తి వెళ్లిందని, వెళ్లిన నెక్ట్స్ డేనే చనిపోయిందని ఆవేదన చెందుతున్నారు. టిక్ టాక్ వీడియోల పిచ్చి బాగా ఉండేదని కూడా అంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.