Posco Act : ఆ తల్లిచేసిన పనికి దారుణం అనే మాట చిన్నది...
దిశ యాక్ట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన రోజే దారుణం జరిగింది. కన్నతల్లే కూతురి పాలిట రాక్షసిలా మారింది.
దిశ యాక్ట్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన రోజే దారుణం జరిగింది. కన్నతల్లే కూతురి పాలిట రాక్షసిలా మారింది. తన ప్రియుడి కోరికలు తీర్చడానికి కన్నకూతుర్నే పంపించి
అమ్మతనానికే మాయనిమచ్చ తెచ్చింది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో కటారపు మార్తమ్మ తన ప్రియుడు తంగిరాల రాంబాబు (56)దగ్గరికి మైనరైన తన
కూతుర్ని బలవంతంగా పంపించింది. మైనర్ బాలిక తల్లి సాక్షిగా ఒక రాత్రి మొత్తం బాలికకు తంగిరాల రాంబాబు నరకం చూపించాడు. ఈ విషయం ఉదయం తన నాన్నమ్మకు చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మార్తమ్మను అరెస్ట్ చేశారు, రాంబాబు పరారీలో ఉన్నాడు. పోస్కో చట్టం కింద వీరిమీద కేసు పైల్ చేశారు.