Maha Shivratri 2022: భక్తులతో కిటకిటలాడుతున్న ఏపీలోని శివాలయాలు
అమరావతి: శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ లోని శివాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల శివనామ స్మరణతో దేవాలయాల్లో సందడి నెలకొంది. ఇలా విజయవాడలోని పాత శివాలయం కూడా ఇవాళ ఉదయంనుండే భక్తులతో కిటకిటలాడుతోంది. గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వరస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బిందెతీర్ధంతో జరిగిన తొలిపూజతో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.