మిర్చి రైతులను జగన్ కలవడం ఇల్లీగలా?: బొత్స సత్యనారాయణ | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Feb 21, 2025, 10:00 PM IST

మిర్చి రైతుల క‌ష్టాలు, న‌ష్టాలు తెలుసుకోవ‌డానికి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గుంటూరు మిర్చియార్డ్‌కు వెళ్తే త‌ప్పేంట‌ని, అది ఇల్లీగ‌లా అవుతుందా అని మాజీ మంత్రి, శాస‌నమండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. మ‌రి విజ‌య‌వాడ‌లో అట్ట‌హాసంగా టీడీపీ ఆధ్వ‌ర్యంలో మ్యూజిక‌ల్ నైట్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం లీగ‌ల్ అవుతుందా అని చంద్ర‌బాబును సూటిగా ప్ర‌శ్నించారు. విశాఖ‌లో మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌తో క‌లిసి బొత్స స‌త్యానారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. రైతులు, వ్యవసాయం దండగ అనే భావన చంద్రబాబు మనసులో ఇంకా పోలేద‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ జ‌గ‌న్‌ మిర్చి యార్డ్ కు వెళ్ళిన తర్వాత మిర్చి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలిసింద‌ని చెప్పారు. రైతుల‌కు మద్దతు ధర ఇవ్వాలనే ఆలోచన రెండు నెలల క్రితమే ఎందుకు చేయలేద‌ని ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. కేంద్ర మంత్రి ఢిల్లీ లో లేనప్పుడు మిర్చి రైతుల కోసం చర్చించడానికి వెళుతున్నామని చంద్ర‌బాబు చెప్పడం ఎంత వరకు సమంజసమ‌న్నారు. విశాఖలో జరిగిన భూ కుంభకోణాలపై విచారణ నివేదికలను బహిర్గతం చేయాల‌ని డిమాండ్ చేశారు.

Read More...