Asianet News TeluguAsianet News Telugu

విశాఖ గ్యాస్ లీక్ ఘటన : ఒకేసారి ఆరుగురికి ఆక్సీజన్ సరఫరా.. జంబో కిట్లను అందించిన నావికాదళం...


విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ ఘటనలో బాధితులను ఆదుకునేందుకు భారత నావికా దళం మరో 5 పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్స్ సెట్లను విశాఖ కేజీహెచ్ కు అందించింది. 


విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ ఘటనలో బాధితులను ఆదుకునేందుకు భారత నావికా దళం మరో 5 పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్స్ సెట్లను విశాఖ కేజీహెచ్ కు అందించింది. వీటి ద్వారా ఏకకాలంలో ఆరుగురు పేషంట్లకు ఆక్సీజన్ సరఫరా అవుతుంది. ఇప్పటికే కోవిద్ పేషంట్లకోసం ఇటువంటి 25 సెట్లను అందించింది. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో తిరుగుతున్న ఎస్డిఆర్ఎఫ్ బృందానికి 50 బ్రీతింగ్ సెట్లు, అనుబంధ పోర్టబుల్ ఎయిర్ కంప్రెసర్లు అందించింది. దీంతోపాటు నావికాదళానికి చెందిన 2  అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.