Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబే అలాంటి వాడు... అందుకే జగన్ పై దుష్ఫ్రచారం: హోంమంత్రి సుచరిత ఫైర్

అమరావతి: సీఎం జగన్ కుటుంబంపై విమర్శలు చేస్తున్న టిడిపి నాయకులపై హోంమంత్రి మేకతోటి సుచరిత విరుచుకుపడ్డారు. 

అమరావతి: సీఎం జగన్ కుటుంబంపై విమర్శలు చేస్తున్న టిడిపి నాయకులపై హోంమంత్రి మేకతోటి సుచరిత విరుచుకుపడ్డారు. కుటుంబ విలువలు లేని వ్యక్తులు, వెన్నుపోటుదారుల నాయకత్వంలో పనిచేసేవారు, అసలు కుటుంబ విలువలే లేని వ్యక్తులు సీఎం జగన్ రెడ్డి, ఆయన కుటుంబం గురించి మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. ఈ మాటలను చూసి ప్రజలే వారిని మరింతగా అసహ్యించుకుంటున్నారని అన్నారు. చంద్రబాబుకు కుటుంబ అనుబంధాలు లేవు కాబట్టి ఎవరికీ కుటుంబ అనుబంధాలు ఉండకూడదు అనుకుంటాడని అన్నారు. ఆయనకు చెల్లెళ్ళు, తోబుట్టువుల మీద ప్రేమ లేదు కాబట్టి ఎవరికీ చెల్లెళ్ళ మీద ప్రేమ లేదని ప్రచారం చేయిస్తాడని ఆరోపించారు. చంద్రబాబు ఏ స్థాయికి దిగజారతారో ఆయన 40ఏళ్ళ రాజకీయ జీవితంలో ఒకటి కాదు రెండు కాదు వంద ఉదాహరణలు దొరుకుతాయి... అందుకే తన మాదిరిగానే అందరూ ప్రవర్తిస్తారని పదే పదే ఆరోపణలు చేయిస్తుంటాడని హోంమంత్రి మండిపడ్డారు.