రెండొందల గడపల్లో కూడా లేని ఉద్యమానికి.. అంతర్జాతీయ స్థాయి ముసుగు.. గుడివాడ అమర్ నాథ్
ప్రధాన పత్రికలలో, టీడీపీ కి చెందిన సామాజిక మాధ్యమాలలో అమరావతి రాజధాని కోసం ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల నగరాలలో ఉద్యమం జరుగుతోంది అని రాశారు.
ప్రధాన పత్రికలలో, టీడీపీ కి చెందిన సామాజిక మాధ్యమాలలో అమరావతి రాజధాని కోసం ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల నగరాలలో ఉద్యమం జరుగుతోంది అని రాశారు. విశాఖకు, ఉత్తరాంధ్రకు మేలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రాంత ప్రజలు ఆలోచనలకు అనుగుణంగా జగన్మోహనరెడ్డి పని చేస్తుంటే చంద్రబాబు ప్రచారం చూస్తే బాధ కలుగుతుంది. ఉద్యమం అందామా అంటే ఉద్యమ విలువలు పోతున్నాయి. కేవలం ఫోటోలు కు పరిమితమైన దానిని అమరావతిలో రెండు వందల గడపలలో లేని ఉద్యమంని అంతర్జాతీయ సమస్య గా చూపిస్తున్నారు. స్టేట్ కోసం కాకుండా రియల్ ఎస్టేట్ గా చూస్తున్నారు. జగన్మోహనరెడ్డి మూడు ప్రాంతాల అభివృద్ధి ద్యేయం గా పని చేస్తుంటే చంద్రబాబు అతని కోటరీ అడ్డు పడుతున్నారు.