కృష్ణా జిల్లా: ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం... తాగుబోతు బస్ డ్రైవర్ అరెస్ట్
కృష్ణా జిల్లాలో నూజివీడులో మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్ ను పోలీసులకు పట్టించారు ప్రయాణికులు.
కృష్ణా జిల్లాలో నూజివీడులో మద్యం మత్తులో బస్సును నడుపుతున్న డ్రైవర్ ను పోలీసులకు పట్టించారు ప్రయాణికులు. ఫూటుగా మద్యం సేవించి తన ప్రాణాలనే కాదు ప్రయాణికుల ప్రాణాలను రిస్క్ లో పెట్టి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ప్రయాణికుల సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు.
ప్రయాణికులను ఎక్కించుకుని సోమవారం ఉదయం విస్సన్నపేట నుండి హైదరాబాద్ కు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. అయితే అప్పటికే ఫుల్లుగా తాగేసివున్న డ్రైవర్ తూలుతూనే అత్యంత నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయసాగాడు. ఇది గమనించిన ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ అదే బస్సులో ప్రయాణిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో నూజివీడు పట్టణంలో పోలీసులు బస్సును ఆపి సదరు డ్రైవర్ కు పరీక్ష చేయగా మద్యం సేవించినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో సదరు డ్రైవర్ తో పాటు బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు రాకతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.