మాజీ మంత్రి దేవినేని అరెస్ట్... ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల స్టేషన్ల వద్ద ఉద్రిక్తత

విజయవాడ: మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అరెస్ట్ నేపద్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

First Published Jan 19, 2021, 3:57 PM IST | Last Updated Jan 19, 2021, 3:57 PM IST

విజయవాడ: మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అరెస్ట్ నేపద్యంలో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గొల్లపూడిలో దేవినేనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈలప్రోలు వైపుగా పోలీస్ కాన్వాయ్ ని తీసుకెళ్ళడంతో మైలవరం లేదా ఇబ్రహీంపట్నం పీఎస్ కు ఆయనను తరలించవచ్చనే సమాచారం అందుకున్న టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నం పీఎస్ కు చేరుకున్నారు. అయితే ఇబ్రహీంపట్నం పీఎస్ కు దేవినేనిని తీసుకొచ్చిన పోలీసులు అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా వుండటంతో ఒక అరగంట తర్వాత తమ వాహనంలో బయటకు తీసుకెళ్ళారు. అయితే అక్కడినుండి పమిడిముక్కల స్టేషన్ కు తీసుకు తీసుకెళ్లినట్లు తెలుసుకున్న టిడిపి శ్రేషులు ఆయనను  విడుదల చేయాలంటూ స్టేషన్ ముందు నిరసనకు దిగారు.