కావలి శివారులో ఘోరం.... జాతీయ రహదారి పక్కనే మహిళ సజీవదహనం
అమరావతి: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది.
అమరావతి: నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కావలి శివారులో జాతీయ రహదారికి పక్కనే ఓ ప్రైవేట్ లేఅవుట్ లో మహిళ మృతదేహం కాలిపోయిన స్థితిలో పడివుండగా కల్లుగీత కార్మికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా అడిషనల్ ఎస్పీ దేవరకొండ ప్రసాద్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 35 సంవత్సరాల వయస్సు గల మహిళను గుర్తుతెలియని దుండగులు సజీవ దహనం చేసినట్లుగా అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేస్తామని పోలీసులు తెలిపారు.