దావోస్ చేరుకున్న సీఎం జగన్ కు ఘన స్వాగతం
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దావోస్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్ అక్కడినుండి రోడ్డుమార్గంలో దావోస్ చేరుకున్నారు. ఇప్పటికే డబ్ల్యూఈఎఫ్ సదస్సుకోసం దావోస్ చేరుకున్న పరిశ్రమల మంత్రి అమర్నాథ్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ప్రిన్సిపల్ కార్యదర్శి ఆరోఖ్యరాజ్ ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. అలాగే స్విట్జర్లాండ్‌లో భారత ఎంబసీ కార్యదర్శులు రాజీవ్‌కుమార్, బిజు జోసెఫ్ లో పాటు ఆ దేశంలోని తెలుగు ప్రజలు కొందరు సీఎం జగన్ కు స్వాగతం పలికారు.