MLC Elections Results: కూట‌మి పాల‌న‌కు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫ‌లితం చెంపపెట్టు: గుడివాడ అమర్నాథ్

Galam Venkata Rao  | Published: Mar 4, 2025, 5:00 PM IST

కూట‌మి ప్ర‌భుత్వ ప్రజావ్యతిరేక పాలనకు ఉత్తరాంధ్ర టీచ‌ర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫ‌లితం చెంప‌పెట్టులాంటిద‌ని వైయ‌స్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షులు, మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ అన్నారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక ఉత్తరాంధ్రపై చూపుతున్న వివ‌క్ష‌కు నిరసనగా టీచ‌ర్లు గ‌ట్టి షాకిచ్చార‌ని అన్నారు. ఓటమిని అంగీక‌రించ‌లేక గెలిచిన అభ్య‌ర్థే తమ అభ్య‌ర్థి అని కూటమి నేతలు చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు.

Read More...