Asianet News TeluguAsianet News Telugu

రాజధానిపై సంచలన తీర్పు... ఏపీ హైకోర్టుకు అమరావతి రైతుల సాష్టాంగ నమస్కారం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  

First Published Mar 3, 2022, 3:54 PM IST | Last Updated Mar 3, 2022, 3:54 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.  సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు స్పష్టం చేసింది.  6 నెలల్లో అభివృద్ది ప్రణాళికులు పూర్తి ఆదేశించింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ది పరిచిన ప్లాట్లను అప్పగించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పుపై  అమరావతి రైతుల హర్షం వ్యక్తంచేసారు. ఏపీ హైకోర్టు ఆవరణలోనే న్యాయం గెలిచింది-ధర్మం నిలిచింది, జై అమరావతి  అంటూ నినాదాలు చేసారు రాజధాని రైతులు, న్యాయవాదులు. కొందరు రైతులయితే  హైకోర్టుకు సాష్టాంగ నమస్కారం చేసారు.