విక్రమ్ చిత్రం   జూన్ 3న ఇటు తెలుగుతో పాటు అటు తమిళ, హిందీ భాషాల్లో కూడా మంచి ఆదరణ పొందింది. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా ఎంత రాబట్టిందంటే..


లోకనాయకుడు కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం విక్రమ్‌. నాలుగేళ్ల గ్యాప్‌ తర్వాత ఈ సినిమాతో వచ్చిన కమల్‌ కలెక్షన్లతో బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన సంగతి తెలిసిందే. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్‌ ఆ తర్వాత కొద్ది రోజులకే రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. వీకెండ్‌ను బాగా క్యాష్‌ చేసుకున్న ఈ మూవీ ఆ తర్వాత డ్రాప్ అవుతుందని అంతా భావించారు. కానీ ఆ హవా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా పెరిగి పెద్దదై చివరకు కోలివుడ్ లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ ని క్రియేట్ చేసింది. అంతేకాదు ఆ తర్వాత.... అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విక్రమ్‌ దుమ్ము దులిపింది. ట్రేడ్ వర్గాల నుంచి అందతున్న సమాచారం మేరకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ చూస్తే..

తమిళనాడులో ఈ చిత్రం 184 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. అందులో 93 కోట్ల షేర్ తెచ్చుకుంది. ఆ తర్వాత కేరళలో ఈ సినిమా అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ ఇచ్చింది. నలభై కోట్లు గ్రాస్, 17 కోట్లు షేర్ వచ్చింది.ఫాహద్‌ ఫాజిల్‌ మళయాళ మార్కెట్ కు బాగా ఉపకరించారు. కర్ణాటకలో 25 కోట్లు గ్రాస్ వస్తే 12 కోట్లు షేర్ వచ్చింది. తెలుగులోనూ ఈ సినిమా దుమ్ము దులిపింది. 34 కోట్లు గ్రాస్ వస్తే ...18 కోట్లు షేర్ వచ్చింది. మిగిలిన భారత్ దేశంలోని ప్రాంతాలలో 18 కోట్లు గ్రాస్ వస్తే 8 కోట్లు షేర్ వచ్చింది.

ఇక ఓవర్ సీస్ మార్కెట్ అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ షాకింగే అని చెప్పాలి. అక్కడ 125 కోట్ల గ్రాస్ వచ్చింది. అంటే 59 కోట్లు షేర్ వచ్చినట్లు. యుస్ డిస్ట్రిబ్యూటర్స్ కు ఓ రేంజిలో లాభాలు తెచ్చిపెట్టింది చిత్రం. ఓవరాల్ గా ప్రపంచం వ్యాప్తంగా ...426 కోట్లు గ్రాస్ ...207 కోట్ల షేర్ తెచ్చుకుందీ చిత్రం. 

67 ఏళ్ల వయసులోనూ యంగ్‌ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా ఫైట్స్‌ సీన్స్‌ చేయడం గమనార్హం. విజయ్‌ సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌, సూర్య ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగులో 'విక్రమ్‌: హిట్‌ లిస్ట్‌' పేరుతో సుధాకర్‌ రెడ్డి, హీరో నితిన్‌ విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఓటీటీ హాట్ స్టార్‌లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.