సారాంశం

Indrakeeladri: బెజవాడ ఇంద్రకీలాద్రికి భ‌క్తులు పొటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కావ‌డంతో అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్నారు. ద‌స‌రా న‌వ‌రాత్రి వేడుక‌ల‌లో భాగంగా తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.
 

Durga Malleswara Swamy Varla Devasthanam: బెజవాడ ఇంద్రకీలాద్రికి భ‌క్తులు పొటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం కావ‌డంతో అమ్మ‌వారిని ద‌ర్శించుకోవ‌డానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్నారు. ద‌స‌రా న‌వ‌రాత్రి వేడుక‌ల‌లో భాగంగా తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. విజ‌య‌వాడ‌ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఎస్‌డిఎంఎస్‌డి)లో ప్రధాన వార్షిక ఉత్సవాలైన‌ దసరా వేడుక‌లు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు సుప్రభాత సేవ, స్నపనాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనలతో 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు.  ఉదయం 9 గంటల తర్వాత అన్ని పూజలు ముగించుకుని భక్తులను శ్రీ కనకదుర్గా దర్శనానికి అనుమతించారు. తొలిరోజు అమ్మ‌వారు పీఠాధిపతి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. కాగా, ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో యాత్రికులు ఉత్సవాలకు తరలివచ్చారు. దీంతో ఆల‌య ప్రాంతంలో భ‌క్తుల సంద‌డి నెల‌కొంది.

రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు ఉదయం 5 గంటలకే ఆలయ ప్రాంగణానికి చేరుకుని దుర్గా, కృష్ణవేణి ఘాట్‌ల వద్ద కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఈ ఏడాది ఈ 9 రోజులలో 8 లక్షల మందికి పైగా భక్తులు దుర్గాదేవిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు, అందుకనుగుణంగా సంబంధిత అధికారులు యాత్రికుల సౌకర్యార్థం ఫూల్‌ప్రూఫ్ ఏర్పాట్లు చేశారు. కాగా, ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గాదేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతున్నాయ‌నీ, రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది భక్తులు కనకదుర్గా దేవిని దర్శించుకుంటున్నార‌ని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటివరకు యాత్రికులు ఎటువంటి అవాంతరాలు లేకుండా దర్శనం పొందుతున్నారని చెప్పారు. వృద్ధులు, మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు సిబ్బంది, వాలంటీర్లకు పనిచేయాలని పేర్కొంది.

అక్టోబర్ 20న సీఎం పట్టువస్త్రాలు సమర్పిస్తారు..

ఈ సంవత్సరం మూలా నక్షత్రం పవిత్రమైన రోజు ఎందుకంటే ఇది దేవత జన్మ నక్షత్రం.. అక్టోబర్ 20 న వస్తుంది, అందుకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అదే రోజు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సాధారణంగా, ఈ రోజున ఒకటి నుండి 1.5 లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి, కనకదుర్గా దేవిని దర్శించుకుంటారు. ఈ ఏడాది దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శన సమయం ఉంటుందని అధికారులు తెలిపారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఇవ్వగా, మిగిలిన రోజుల్లో ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. మూలా నక్షత్రం రోజున వేళలు తెల్లవారుజామున 2 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఉంటాయి.