Vijayawada: విజయవాడ లోని కలకలం రేగింది. కనకుదుర్గ వారధి వద్ద అనుమానస్పదస్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైంది. దీంతో హత్య అని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
Vijayawada: విజయవాడ లోని కనకుదుర్గ వారధి వద్ద ఓ యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మృతుడిని పెనమలూరుకు చెందిన బీటెక్ విద్యార్థి నాగేంద్రగా పోలీసులు గుర్తించారు. అతడు దనేకుల కాలేజీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గత ఆదివారం బయటకు వెళ్ళిన నాగేంద్ర ఆ రోజు ఇంటికి రాకపోవడంతో.. అతని తల్లిదండ్రులు 11వ తేదీన పెనమలూరు పోలీస్ స్టేషన్లో నాగేంద్ర కనబడటం లేదని ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో నాగేంద్ర మృతదేహం.. విజయవాడ లోని కనకదుర్గ వారధి వద్ద యువకుడి మృతదేహం లభ్యమైంది. అయితే.. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు కనిపించటం లేదని కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించగా తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని ఆరోపించారు. కాలేజీ ప్రిన్సిపాల్ వేధింపులే నాగేంద్ర మృతికి కారణమని కుటుంబ సభ్యులు, స్నేహితులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నాగేంద్ర ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదనీ, ఖచ్చితంగా హత్య చేసి నదిలో పడేశారని ఆరోపిస్తున్నారు. కళాశాలలో చదువుతున్న విద్యార్థి మృతి చెందితే ఇప్పటి వరకు.. యాజమాన్యం స్పందించక పోవడంతో పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. చిత్తూరు జిల్లా కండలేరు జలాశయంలో మంగళవారం సాయంత్రం గల్లంతైన ముగ్గురి మృతదేహాలు బుధవారం వెలికితీశారు. చేజర్ల మండలం కొల్లపనాయుడుపల్లి లో నివాసముంటున్న.. రెండు కుటుంబాలకు చెందిన వారు జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. సరదాగా ఈత కొటుదామని జలాశయంలోకి దిగి ముగ్గురు గల్లంతారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక యువకుడు ఉన్నారు. సరదాగా ఈతకు వెళ్ళి.. మృత్యుఒడిలోకి చేరుకోవడంతో ఆ గ్రామం శోకసంద్రంగా మారింది.
వివరాలోకెళ్తే.. తమిళనాడుకు చెందిన కొన్ని కుటుంబాలు.. బతుకుదెరువు కోసం.. కొల్లపనాయుడుపల్లి గ్రామానికి వచ్చి.. నివాసం ఉంటున్నాయి. ఈ క్రమంలో అన్నదమ్ములైన పొన్ను కుమార్, బోసు తమ భార్యాపిల్లలతో కలిసి మంగళవారం సాయంత్రం కండలేరు డ్యాంను చూసేందుకు వెళ్లారు. అక్కడ వారు ఈత కొట్టాలని జలాశయంలోకి దిగారు. అయితే.. లోతు ఎక్కువగా ఉండటంతో.. పొన్నుకుమార్ (36), ఆయన కుమార్తె పవిత్ర (6) బోసు కుమార్తె లక్ష్మి (11) జలాశయంలో నీటి మునిగి గల్లంతయ్యారు.
కుటుంబ సభ్యుల ఆర్తనాథాలతో.. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. అక్కడ ఉన్న జాలర్లను రంగంలోకి దించారు. కానీ ఎంత వెతికినా.. ఆచూకీ లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న పొదలకూరు సీఐ సంగమేశ్వర రావు, కండలేరు ఎస్ఐ అనూష, వీఆర్వో రాజగోపాల్ నాయుడు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని.. గజ ఈతగాళ్ల సహాయంతో గాలించారు. మంగళవారం చీకటి పడే వరకు వెతికినా ప్రయోజనం లేకపోవడంతో.. బుధవారం మళ్లీ గాలించి మృతదేహాలను వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
