Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తమ మంత్రి వర్గం నుంచి మంత్రి దినేష్ ఖటిక్ రాజీనామా చేశారు. తనని దళితుడనే.. ఎలాంటి బాధ్యతలివ్వలేదని, తనను పక్కన పెట్టారని ఫిర్యాదు చేస్తూ రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాను దళితుడైనందున తనను పక్కన పెట్టారని ఫిర్యాదు చేస్తూ ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ఖటిక్ రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు.
ఉత్తరప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి ఖటిక్ తన లేఖలో తనకు 100 రోజుల పదవీకాలంలో.. తనకు ఎలాంటి పని అప్పగించలేదని పేర్కొన్నారు. శాఖాపరమైన బదిలీల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. తనని దళితుడని అవమానించిందుకే రాజీనామా చేస్తున్నానని సంచలన ఆరోపణలు చేశారు.
తాను దళితుడు కావడం వల్లే తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదనీ, తన మాట ఎవరూ వినడం లేదని మంత్రి ఆరోపించారు. తాను రాష్ట్రమంత్రిగా పని చేయడం దళిత వర్గానికి వ్యర్థమనీ, ఏ సమావేశం గురించి కూడా తనకు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు మంత్రిగా ఓ అధికారిక వాహనం మాత్రమే ఇచ్చారని, ఇది దళిత సమాజాన్ని అవమానించడమేనని హోంమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మంత్రి బదిలీ కేసుల్లో కూడా పెద్ద అవినీతి ఆరోపణలు చేశారు. అధికారులను అడిగితే.. ఇంకా సమాచారం ఇవ్వలేదని చెప్పారు.
నమామి గంగే పథకంలో కూడా అవినీతి జరిగిందని మంత్రి అన్నారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బిజెపి ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన వారిని గౌరవంగా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వంలోని అధికారులు దళితులను అవమానిస్తున్నారనీ, అటువంటి పరిస్థితిలో.. రాష్ట్ర మంత్రిగా పదవికి రాజీనామా చేస్తున్నాను. అని సంచలన ఆరోపణలు చేశారు.
మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా రాజనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన టీమ్‌లోని ఓ అధికారిని ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడంపై జితిన్ ప్రసాద ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది యూపీ ఎన్నికలకు నెలరోజుల ముందు ప్రసాద కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారారు.
ప్రసాదకు కీలక మంత్రిత్వ శాఖ - పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) - అయితే ఆ శాఖ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటుంది. ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించిందని, పలువురు అధికారులు బదిలీల కోసం లంచం తీసుకున్నట్లు తేలింది. డిపార్ట్‌మెంటల్ బదిలీల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన ఐదుగురు సీనియర్ పీడబ్ల్యూడీ అధికారులను మంగళవారం యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంత్రి ప్రసాద.. ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అనిల్ కుమార్ పాండే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి, బదిలీలు, పోస్టింగ్‌ల కోసం లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్నారు. పాండేని తొలగించారు. అతనిపై విజిలెన్స్ విచారణ ప్రారంభించబడింది.
ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ మంత్రి దినేష్ ఖటిక్ రాజీనామా చేయడంతో రాజకీయ దూమారం రేగింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాజీనామా వార్తలపై స్పందించారు. రాజీనామా వార్తపై బీజేపీకి చురకలంటించారు.
మంత్రి దినేష్ ఖాటిక్ రాజీనామాపై హేళన చేస్తూ.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ ట్వీట్ చేశారు. "మంత్రి పదవిలో గౌరవం లేదు, దళితుడిని అవమానించడం ఎక్కడ ఉంది. అటువంటి వివక్షతతో కూడిన బిజెపి ప్రభుత్వం నుండి రాజీనామా చేయడమే.. మన సమాజ గౌరవాన్ని నిలబెట్టడానికి ఏకైక మార్గం. కొన్నిసార్లు బుల్డోజర్ కూడా పరిగెత్తుతుంది. రివర్స్ గేర్ లో అని పేర్కొన్నారు.
