Asianet News TeluguAsianet News Telugu

Uttar Pradesh: మహిళా టీచర్ పై బూటుతో దాడి చేసిన ప్ర‌ధానోపాధ్యాయుడు.. video viral ..

Uttar Pradesh: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లఖింపూర్ ఖేరీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మహంగుఖేడా ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, మ‌హిళ టీచ‌ర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆల‌స్యంగా వ‌చ్చింద‌ని ప్రధానోపాధ్యాయుడు..టీచ‌ర్ పై బూటుతో దాడికి పాల్ప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ కావ‌డంతో విద్యాశాఖ అధికారులు సీరియ‌స్ అయ్యారు. 
 

UP Govt school principal thrashes female teacher with shoes for coming late in Lakhimpur Kheri; video goes viral
Author
Hyderabad, First Published Jun 25, 2022, 3:29 AM IST

Uttar Pradesh: ఎవరికైనా త‌న కోప‌మే త‌న శత్రువు.. తన శాంతమే తనకు రక్షణగా నిలుస్తుంది. అవును ఈ మాట అక్ష‌రాల నిజం. ప్ర‌తి చిన్న విష‌యానికి కోపానికి రాకుండా.. శాంతంగా ప‌ని చేసుకుంటూ వెళ్లాలి. లేదంటే జీవితంలో చాలా ఇబ్బందుల‌కు గురి కావాల్సి వ‌స్తుంది. సంయ‌మ‌యం పాటించ‌కుండా.. నోరు పారేసుకుంటే.. గొడ‌వ‌లకు దారి తీస్తాయి. జీవితాలే ప్ర‌మాదంలో ప‌డిపోతాయి. అలాంటి ఘ‌ట‌న‌నే నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. 

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న సోషల్ మీడియాలో వైరల్ కావ‌డంతో జిల్లా విద్యాశాఖ షేక్ అయ్యింది. చిన్నపాటి విషయానికే ఓ ప్ర‌ధానోపాధ్యాయుడు.. మ‌హిళ ఉపాధ్యాయురాలిపై చెప్పుతో దాడి చేసిన ఘ‌టన సంచ‌ల‌నంగా మారింది. ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకున్న ఉన్న‌తాధికారులు ఆ ఉపాధ్యాయుడిపై క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టారు. సస్పెండ్ చేసి.. ఇంటికి పంపించారు. ఈ ఘ‌ట‌న‌ లఖింపూర్‌లోని సదర్ బ్లాక్‌లో ఉన్న మహంగుఖేడా ప్రాథమిక పాఠశాలలో జరిగింది. ఉపాధ్యాయుల తీరుపై శిక్షామిత్ర సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
 
సమాచారం ప్రకారం..  లఖింపూర్ ఖేరీ లోని మహేంగు ఖేరా అనే గ్రామంలోని ప్రాథ‌మిక‌ పాఠశాలలో అజిత్ వర్మ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నాడు. అదే పాఠ‌శాల‌లో సీమ  అనే కూడా ఉపాధ్యాయునిగా విధులు నిర్వ‌హిస్తోంది. అయితే.. పాఠశాలకు ఆ మహిళ టీచర్ ఆలస్యంగా వచ్చింది. దీంతో ఆగ్ర‌హానికి గురైన ఆ ప్రిన్సిపల్.. అందరి ముందే ఆమెపై రెచ్చిపోయాడు. ఇష్టానూసారంగా బూతులు తిట్టాడు. దీంతో ఆమెకు ఆ ప్రిన్సిప‌ల్ ను తిట్టింది. దీంతో స‌హ‌నం కోల్పోయిన ఆ ప్రిన్సిపాల్ ..త‌న బూటు తీసుకుని ఆ మ‌హిళ‌ టీచర్ పై దాడి చేశాడు. ఇష్టమోచ్చినట్లు కొట్టాడు. దీంతో అక్కడే ఉన్న తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు షాక్ కు గురయ్యారు. ఆ తర్వాత.. ఉపాధ్యాయురాలు కూడా ప్రిన్సిపల్ ను కొట్టింది. మ‌రో ఉపాధ్యాయుడు వారిని అడ్డుకోవ‌డంతో ఆ దాడి అంత‌టితో ఆగింది. 

 ఈ దాడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్.. అజిత్ వర్మను సస్పెండ్ చేసిన‌ట్టు  జిల్లా విద్యాశాఖ అధికారి (బిఎస్‌ఎ) లక్ష్మీకాంత్ పాండే తెలిపారు.  అయితే.. ఈ ఘ‌ట‌న‌పై  ఆ ప్రిన్సిపల్ వాదన మరోలా ఉంది. సదరు ఉపాధ్యాయురాలు రోజు కావాలనే ఆలస్యంగా వస్తుందని, మొదట ఆమెను తనపై చేయి చేసుకుందని వివ‌ర‌ణ ఇచ్చాడు.  మ‌రోవైపు.. ఈ ఘ‌ట‌న‌పై ఉపాధ్యాయురాలు స్థానిక పోలీస్ట్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios