India INX, NSE IFSC Merger : GIFT ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్లోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE IFSC , బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు చెందిన India International Exchange అంతర్జాతీయ ఎక్స్ఛేంజీలు గ్లోబల్ ప్రత్యర్థులకు పోటీగా ఒకే వేదికను సృష్టించే ఉద్దేశ్యంతో త్వరలో విలీనం కానున్నాయి. దీనికి సంబంధించి NCLTలో నెలాఖరులో గా ప్రతిపాదన వెళ్లే అవకాశం ఉంది.
BSE, NSE అదానీ గ్రూప్ షేర్ల క్షీణతపై పెద్ద నిర్ణయం తీసుకుంది, సర్క్యూట్ ఫిల్టర్ పరిమితిని మార్చింది BSE, NSE అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్, లోయర్ సర్క్యూట్ పరిమితిని తగ్గించాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) కొత్త ఎండీ, సీఈఓగా ఆశిష్ కుమార్ చౌహాన్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఎన్ఎస్ఈలో ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విక్రమ్ లిమాయే స్థానంలో ఆశిష్ నియమితులయ్యారు.
Karvy కుంభకోణంలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లపై SEBI(Securities and Exchange Board of India) కొరడా ఝుళిపించింది. కార్వీపై సకాలంలో ఎటువంటి చర్య తీసుకోలేదని ఆరోపిస్తూ, రెండు స్టాక్ ఎక్స్ చేంజీలపై రెండు వేర్వేరు ఆర్డర్లలో BSEపై రూ.3 కోట్లు, NSEపై రూ.2 కోట్లు చొప్పున జరిమానా విధించింది.
NSE Scam రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ స్కాంలో ఇప్పటికే ప్రధాన నిందితులుగా ఉన్న చిత్ర రామకృష్ణ, ఆనంద్ సుబ్రహ్మణ్యంలను అరెస్టు చేయగా, సీబీఐ దర్యాప్తులో హిమాలయ అదృశ్య యోగి పేరిట ఆనంద్ సుబ్రహ్మణ్యమే ఈ-మెయిల్ ఐడీని సృష్టించినట్లు సీబీఐ నిర్ధారణకు వచ్చింది.
NSE Scam: నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కోలొకేషన్ కుంభకోణం రోజుకో మలుపు తీసుకుంటోంది. ఇప్పటికే సంస్థ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణకు 7 రోజుల రిమాండ్ విధించగా, సంస్థ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్‌ను సీబీఐ కోర్టు బుధవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.
NSE Co-Location Scam కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను (Chitra Ramkrishna) ఢిల్లీ కోర్టు సోమవారం 7 రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపింది. సీబీఐ కోర్టు ఆనంద్ సుబ్రమణ్యం కస్టడీని మార్చి 9 వరకు పొడిగించింది.
దేశీయ ప్రధాన స్టాక్ ఎక్స్చేంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈలో సోమవారం సాంకేతిక సమస్య తలెత్తింది. ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికి కొన్ని స్టాక్స్ ధరలు తెరపై అప్ డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్చేంజీ దృష్టికి తీసుకు వచ్చాయి.
చిత్రా రామకృష్ణ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్-NSE ఎండీ, సీఈవో. 2013లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ‘విమన్ ఆఫ్ ది ఇయర్’ ఆమె. భారత్‌లో రెండో శక్తిమంతమైన మహిళా వ్యాపారవేత్త. ఇదంతా గతం.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె అరెస్ట్ దాదాపుగా ఖాయమైనట్టే కనిపిస్తోంది.