Search results - 90 Results
 • komati

  Telangana17, May 2019, 2:43 PM IST

  టీఆర్ఎస్ లో నీపని అయిపోయింది: గుత్తాకు కోమటిరెడ్డి వార్నింగ్

  రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే గుత్తా రాజకీయ జీవితం ముగిసినట్లేనని విమర్శించారు. మంత్రి పదవి కాదు కదా... కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా రాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తమకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తామో గుత్తాయే చెప్పాలని డిమాండ్ చేశారు. 

 • ap dgp rp takur

  Andhra Pradesh15, May 2019, 3:04 PM IST

  వైఎస్ వివేకా హత్య కేసుపై తేల్చేసిన డీజీపీ

  వివేకా హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించింది. సిట్ బృందం ఇప్పటికే విచారణ చేపట్టింది. ఆర్థిక లావాదేవీలు, పాతకక్షలు, భూ గొడవలు వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పటిక వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్తున్నారు. 

   

 • Telangana3, May 2019, 4:04 PM IST

  కేసీఆర్ వైఫల్యం వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు: పొన్నాల లక్ష్మయ్య

  విద్యార్థుల మరణాలపై కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. తెలంగాణలో డ్రగ్‌, పబ్‌, ఇసుకమాఫియా రెచ్చిపోతోందన్నారు. తప్పుచేశాడు కాబట్టే మోదీ వద్ద కేసీఆర్‌ మోకరిల్లారని పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. 

 • Telangana29, Apr 2019, 7:24 PM IST

  హజీపూర్ బాధితులను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి: బాధితులకు రూ.లక్ష ఆర్థికసాయం

  రాష్ట్రంలో కనీసం మానవత్వం లేని పాలన నడుస్తోందంటూ విరుచుకుపడ్డారు. బాధిత కుటుంబాలకు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందజేశారు. శ్రావణి తల్లిదండ్రులకు రూ.50వేలు, మనీషా తండ్రికి రూ.50వేలు అందజేశారు. తాము ఉన్నామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం హత్యలు జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. 

 • Motkupalli

  Telangana29, Apr 2019, 6:31 PM IST

  నిందితుడు శ్రీనివాసరెడ్డిని తప్పించేందుకు రాజకీయ కుట్ర : మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

  నిందితుడుకు ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా వదలొద్దని అతడిని ఉరితియ్యాలని డిమాండ్ చేశారు. హజీపుర్ లో కలకలం రేపిన హత్యల ఘటనపై తెలుసుకున్న మోత్కుపల్లి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల  కుటుంబాలను ఓదార్చారు. అనంతరం హత్యలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 

 • తాడికొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పై కూడ అసమ్మతి ఉంది. ఈ స్థానం నుండి మాల్యాద్రి లేదా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్లను పరిశీలిస్తున్నారు. ప్రత్తిపాడుకు డొక్కా మాణిక్య వరప్రసాద్ కుమార్తె లేదా కందుకూరు వీరయ్య, లేదా రిైటర్డ్ అధికారి ఒకరిని ఎంపిక చేసే ఛాన్స్ ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

  Andhra Pradesh16, Apr 2019, 2:47 PM IST

  ఓపికపట్టండి హీరో ఎవరో విలన్ ఎవరో తేలుతుంది: మాజీమంత్రి డొక్కా

  రాష్ట్రంలో గొడవలకు వైసీపీ నేతలే కారణమని ఆరోపించారు. గొడవలు సృష్టించింది వారే గవర్నర్ కు ఫిర్యాదు చేసింది కూడా వారేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు ఎన్నికల కమిషన్ కి కనిపించడం లేదా అని డొక్కా మాణిక్యవరప్రసాద్ నిలదీశారు. 
   

 • sailajanath

  Andhra Pradesh15, Apr 2019, 5:47 PM IST

  ఏపీలో ఎన్నికలు రద్దు చెయ్యాలి: మాజీమంత్రి శైలజానాథ్ డిమాండ్

  రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధంగా జరిగాయని ఆరోపించారు. ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  ఒక నియమ నిబద్దత లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ తమ ఆధీనంలోనే ఉన్నాయని ప్రగల్భాలు పలికిన ఎన్నికల కమిషన్ ఎందుకు ధన ప్రవాహాన్ని అడ్డుకోలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. 

 • రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని టీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అయితే సుమారు 9 స్థానాల్లో కొత్త అభ్యర్థులను మార్చాలని కేసీఆర్ భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

  Telangana12, Apr 2019, 3:50 PM IST

  పోలింగ్ బూతులో టీఆర్ఎస్ మాజీ మంత్రి దౌర్జన్యం...సిబ్బందిపై ఫైర్

  గురువారం తెలంగాణ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని సామాన్య ఓటర్లకు ఆదర్శంగా నిలిచారు. అయితే ఓ టీఆర్ఎస్ మాజీ మంత్రి మాత్రం పోలింగ్ బూతులోనే సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించి ఎన్నికల నిబంధనలకు అతిక్రమించి ఓటేశారు. 
   

 • mukesh

  Telangana11, Apr 2019, 12:17 PM IST

  మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కు తీవ్ర అనారోగ్యం...స్ట్రెచర్‌పై వచ్చి ఓటు

  తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం నడవలేని స్థితిలో వున్నప్పటికి ఓటు హక్కును వినియోగించుకోడాన్ని మాత్రం విస్మరించలేదు. అంబులెన్స్ లో అబిడ్స్ పోలింగ్ బూత్ వద్దకు ఆయన్ను అంబులెన్స్ లో తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు స్ట్రెచర్ సాయంతో బూత్ లోకి తీసుకెళ్లారు. ఓటేసిన తర్వాత ఆయన్ని మళ్లీ అదే అంబులెన్స్ లో తీసుకెళ్లారు. 

 • motkupalli

  Andhra Pradesh assembly Elections 20198, Apr 2019, 3:18 PM IST

  ఆ విషయం తలచుకుని ఎన్టీఆర్ ఎన్నోసార్లు ఏడ్చారు

  పరిటాల సునీత, వంగవీటి రత్నకుమారిల పసుపు కుంకుమ తుడిచింది చంద్రబాబేనని ఆరోపించారు. అలాంటిది పసుపు కుంకుమ అంటావా అంటూ నిలదీశారు. అందరూ వద్దన్నా అల్లుడనే కారణంగా చంద్రబాబును తెలుగుదేశం పార్టీలోకి ఎన్టీఆర్ తీసుకున్నారని గుర్తు చేశారు. అలాంటి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. 

 • babu

  Andhra Pradesh assembly Elections 20198, Apr 2019, 9:25 AM IST

  జిమ్మిక్కులు చేస్తారు బాబును నమ్మకండి: ఏపీ ప్రజలకు మోత్కుపల్లి పిలుపు

  పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో... చంద్రబాబు చేసే ప్రలోభాలకు లొంగిపోకుండా ఏపీ ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని టీటీడీపీ మాజీ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తెలిపారు.

 • Telangana3, Apr 2019, 4:28 PM IST

  కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటోంది మేమే కాదు...వారుకూడా: కడియం

  ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాలని టీఆర్ఎస్ నాయకులందరు కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. కానీ నూతన రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలిస్తూ అభివృద్ది వైపు నడిపిస్తున్న ఆయన ప్రధాని కావాలని యావత్ దేశం కోరుకుంటోందన్నారు. వారి ఆకాంక్ష ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత సాకారమయ్యే అవకాశాలున్నాయని కడియం అభిప్రాయపడ్డారు. 

 • Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 4:59 PM IST

  మాజీమంత్రి పీతల సుజాతపై అంబికా కృష్ణ వ్యాఖ్యలు: దళిత సంఘాలు ఆగ్రహం

   పీతల సుజాతకు పొగరు, అహంకారం ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆమెను ఎమ్మెల్యేగా చేసి కేబినేట్ లో మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు తిరుగుబాటు చేస్తారా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంబికా కృష్ణ వ్యాఖ్యలపై ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యకుడు వెంకటేశ్వరరావు స్పందించారు. ఒక మంత్రిగా పనిచేసి, రాజకీయంగా గుర్తింపు పొందిన దళిత మహిళపై అంబికా కృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం తగదని హెచ్చరించారు.

 • harish rao

  Telangana29, Mar 2019, 9:18 PM IST

  ప్రచారంలో అపశృతి: హరీష్ రావుకు తప్పిన ప్రమాదం

  ప్రచారం రథం నుంచి మంటలు రావడంతో హరీష్ రావుతోపాటు ఎంపీ, ప్రస్తుత ఎంపీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిలను టీఆర్ఎస్ కార్యకర్తలు కిందకు దించేశారు. అనంతరం ఆ వాహనం అగ్నికి ఆహుతైంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం చూసి ఒక్కసారిగా షాక్ కు గురైన హరీశ్ అనంతరం అక్కడ నుంచి దిగి వెళ్లిపోయారు.  

 • dl ravindrareddy

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 4:16 PM IST

  2004 రిపీట్, చంద్రబాబు ఓటమి తప్పదు: వైసీపీలో చేరిన మాజీమంత్రి డీఎల్

  2004లో వైఎస్‌ఆర్ చేతిలో చంద్రబాబు ఎలా ఓడిపోయారో అలాగే 2019లో వైఎస్‌ జగన్‌ చేతిలో చంద్రబాబుకు పరాజయం  అని ఒక ఇంగ్లీషు దినపత్రిక రాసిందని అది నిజం కాబోతుందని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి జోస్యం చెప్పారు.