CJI N V Ramana: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ప్రిన్సిపల్ కార్యదర్శి అమన్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును ఛత్తీస్‌గఢ్ హైకోర్టు 2020లో కొట్టివేసింది. అయితే.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కార్యకర్త ఉచిత్ శర్మ పిటిషన్ దాఖాలు చేశారు. ఈ పిటిషన్ సందర్భంగా .. సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం జడ్జీలను దూషించడమనేది.. కొత్త ట్రెండ్ గా మారిందని, ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి కుయుక్తులకు ప్రైవేటు వ్యక్తులు పాల్పడేవారని, ప్రస్తుతం ప్రభుత్వమే అలాంటి వాటికి పాల్పడుతున్నదని విమర్శించారు.