వైఎస్సార్‌సిపి ఫైర్ బ్రాండ్, హీరోయిన్ రోజా మరోసారి మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై ఫైర్ అయ్యారు. అతడు ఇసుక కొరత పేరుతో ఇటీవల నిరాహార దీక్ష చేపట్టాడని... కానీ  దాని వెనుక ఓ రహస్యం దాగుందంటూ లోకేష్ పై సంచలన కామెంట్స్ చేశారు. 

ఇప్పటివరకు లోకేష్ ను పప్పు అంటూ విమర్శించిన రోజా తాజాగా మరింత ఘాటుగా అతడిపై అటాకింగ్ కు దిగారు.ఈసారి కేవలం లోకేష్ నే కాదు అతడి భార్య బ్రాహ్మణిని కూడా రాజకీయాల్లో లాగారు. లోకేష్ శరీరాకృతిపై ఆమె కామెంట్ చేశారు. 

read more రాష్ట్రంలో ముద్దాయిల పాలన...జగన్ బయటపడటం కష్టమే...: వర్ల రామయ్య

లోకేష్ తిని తిని పిప్పల్లభస్థలాగా మారిపోయారని అన్నారు. ఇంట్లో తన భార్య బ్రాహ్మణి నాజూకుగా వుంది కాబట్టి ఇక తాను కూడా నాజూగ్గా అవుదామని డైటింగ్ చేయాలని భావించినట్లున్నాడని...దీనికోసం కేవలం ఇంట్లో ఉంటే కుదరదనే దీక్ష పైరుతో బయటకు వచ్చాడని అన్నారు. అలా డైటింగ్ చేయడంకోసమే ఇసుక కొరత, కార్మికుల ఆత్మహత్యలు అంటూ దీక్షలో కుచున్నట్టుగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. 

ఆయన నిజంగా ఇసుక సమస్యపై నిరాహారదీక్షకు కూర్చున్నట్లు లేదన్నారు. రాష్ట్రంలో  ఇసుక కొరత వచ్చింది అంటే కారణం ఇసుక బకాసురులైన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు, మాజీ మంత్రి లోకేష్ వల్లేనని అన్నారు. వారి ముఖ్య అనుచరులు నాయకులు, బినామీలే రాష్ట్రంలో ఇసుక వ్యవహారాలన్నీ చూసుకునేవారని ఆరోపించారు.

read more కేసీఆర్ డైరెక్షన్... జగన్ ప్రభుత్వం యాక్షన్...: టిడిపి ఎమ్మెల్సీ

వర్షాలుపడి రాష్ట్రం మొత్తం కలకలలాడుతూ జలాశయాలు నీటితో నిండింది చూసి తండ్రీకొడుకులిద్దరికి కడుపు మండినట్లుందని అన్నారు.. అందువల్లే  నీళ్లు ఉన్నపుడు ఇసుక  తీయడం కుదరదన్న విషయాన్ని తెలిసి కూడా ఈరోజు ప్రజలు అసంతృప్తితో ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.