చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ప్రజలకు కొత్త కష్టం

కుప్పం నియోజకవర్గం  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో త్రాగునీటి‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతు‌న్నారు.  ఉన్న ఏకైక ప్లాంటులో గంటల తరబడి నిలబడినా సుద్ది చేసిన నీరు దొరకడం కష్టం అవుతోంది.  సుజల‌ స్రవంతి నీటి సరఫరాను రెందురోజులుగా ఆపేయడంతో కుప్పం పట్టణవాసులకు త్రాగునీటి ఇబ్బంది ఎక్కువైంది.  

Water issues in Chandrababu constituency kuppam

కుప్పం నియోజకవర్గం  మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో త్రాగునీటి‌ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతు‌న్నారు.  ఉన్న ఏకైక ప్లాంటులో గంటల తరబడి నిలబడినా సుద్ది చేసిన నీరు దొరకడం కష్టం అవుతోంది.  సుజల‌ స్రవంతి నీటి సరఫరాను రెందురోజులుగా ఆపేయడంతో కుప్పం పట్టణవాసులకు త్రాగునీటి ఇబ్బంది ఎక్కువైంది.  

అసలే విషజ్వరాలతో అల్లాడుతున్న ప్రజలకు గుక్కెడు మంచినీరు అందించాల్సిన సమయంలో అదికారుల వైపల్యంతో నీరు అందడం లేదని ప్రజలు అల్లాడుతున్నారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు ఎక్కువవుతున్నాయి. అలాగే ప్రజల సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి, సమస్యలను ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

also read: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు: కారణం అదే...

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఎన్నికల్లో పోటీ చేశారని చంద్రబాబుపై ఎన్నికల పిటిషన్ దాఖలైంది. 

గత ఎన్నికల్లో చంద్రబాబు సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళికి ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన ఎఎస్ విద్యాసాగర్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రాకరం ప్రజా సేవకుడిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాల వివరాలను ఆదాయంలో చూపాలని, అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారని పిటిషనర్ అన్నారు. 

ఆ కేసులో హైకోర్టు చంద్రబాబుకే కాకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులు జారీ చేసింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios