చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు: కారణం అదే...
మాజీ సిఎం, టీడీపీ అధినేత నారా చం్దరబాబు నాయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణపై ఆ నోటీసులు జారీ అయ్యాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి ఎన్నికల్లో పోటీ చేశారని చంద్రబాబుపై ఎన్నికల పిటిషన్ దాఖలైంది.
గత ఎన్నికల్లో చంద్రబాబు సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కృష్ణ చంద్రమౌళికి ఎన్నికల ఏజెంట్ గా వ్యవహరించిన ఎఎస్ విద్యాసాగర్ ఆ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రాకరం ప్రజా సేవకుడిగా ఉన్న వ్యక్తి ప్రభుత్వం నుంచి తీసుకున్న జీతభత్యాల వివరాలను ఆదాయంలో చూపాలని, అయితే అందుకు విరుద్ధంగా చంద్రబాబు వ్యవహరించారని పిటిషనర్ అన్నారు.
ఆ కేసులో హైకోర్టు చంద్రబాబుకే కాకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి కూడా నోటీసులు జారీ చేసింది.