తిరుపతి: మహిళల భద్రత కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కఠినమైన దిశ చట్టాన్ని తీసుకువచ్చింది. దిశ యాప్ ను కూడా తీసుకువచ్చింది. అలాగే మహిళా రక్షణ విషయంలో పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతచేస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు తగ్గడంలేదు. ప్రభుత్వాల కఠిన చట్టాలు, పోలీసులు హెచ్చరికలు మృగాళ్ల చెవికెక్కడం లేదు. దీంతో అమ్మాయిలపై మరీ ముఖ్యంగా అభం శుభం బాలికపై దారుణాలకు పాల్పడుతున్నారు. ఇలా ఓ పదోతరగతి చదువుతున్న యువతిపై ముగ్గురు కామాంధులు లైంగికదాడికి ప్రయత్నించిన సంఘటన తిరుపతి సమీపంలో బయటపడింది. 

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలకేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక స్కూల్ కి సెలవు వుండటంతో పొలానికి  వెళ్లింది. అయితే ఆమె ఒంటరిగా వున్నట్లు గుర్తించిన అదే గ్రామానికి చెందిన  ముగ్గురు కామాంధులు ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. కానీ వారిని తీవ్రంగా ప్రతిఘటించిన బాలిక సహాయం కోసం అరవడంతో అక్కడికి దగ్గర్లో వున్న పశువుల కాపర్లు వచ్చి కాపాడారు. 

ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు.. పెళ్లికొప్పుకోలేదని..

పశువుల కాపర్లను చూసిన ముగ్గురు యువకులు బాలికను వదిలి అక్కడినుండి పరారయ్యారు. దీంతో వారు బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్ద చేర్చారు. తమ కూతరిపై లైంగిక దాడికి ప్రయత్నించిన యువకులపై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రస్తుతం బాలికపై లైంగికదాడికి ప్రయత్నించిన యువకులు సాయి కృష్ణ(25), అంకయ్య(21), వీరస్వామి(22) గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులో తీసుకున ఏర్పేడు పోలీస్ స్టేషన్ లో వుంచి విచారిస్తున్నట్లు రేణిగుంట పోలీసులు తెలిపారు.