Asianet News TeluguAsianet News Telugu

కొడుకుకు చంద్రగిరి, తనకు తిరుపతి... నారావారిపల్లె డ్రామా అందుకే..: పంచుమర్తి అనురాధ

మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో మీటింగ్ పెట్టినట్లు చంద్రగిరి వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. 

panchumarthi anuradha fires on chevireddy bhaskar reddy
Author
Tirupati, First Published Feb 3, 2020, 10:04 PM IST

అమరావతి: టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో మీటింగ్‌ పెట్టే దమ్ము వైసిపి పార్టీకి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లేవని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ విమర్శించారు. అందువల్లే రంగపేట అనే గ్రామంలో సభ  పెట్టి తాను నారావారిపల్లెలో పెట్టామని ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డే తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని అనురాధ అన్నారు. 

వైసిపి మీటింగ్‌ అట్టర్‌ ప్లాఫ్‌..

ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ మీటింగ్‌,  జరిగిన తంతు చూస్తే అధికార పార్టీ నాయకులు నీచ బ్రతుకు అర్ధం అవుతోందన్నారు. ఈ సభలో జనం లేరు.... ప్రజల నుండి కనీస స్పందన లేదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లను సభాస్థలికి తీసుకువచ్చి మేనేజ్ చేయాలన్న చెవిరెడ్డిప్రయత్నాలు కూడా విఫలమయ్యాయని  అన్నారు.

ఎస్పీ యూనివర్శటీ  రిజిస్ట్రార్‌ ను కూడా మేనేజ్‌ చేసి అక్కడ నుంచి విద్యార్దులను రప్పించే ప్రయత్నం చేసిన కూడా మీటింగ్‌ సక్సెస్‌ కాగపోగా వారందరూ కూడా వైసీపీ నాయకుల ముఖంపై ఉమ్మి వేసే పరిస్థితి వచ్చిందన్నారు.  శేషాచలం అడవులకు నిప్పు పెట్టి కాంట్రాక్టు తీసుకొని తన వాటర్‌ ట్రాక్టర్లకు డిపర్లకు  పని పెట్టే నీచ చరిత్ర  చెవిరెడ్డి బాస్కర్‌ రెడ్డిదని అనురాధ విమర్శించారు.         

read more  చంద్రబాబు చాలా సున్నిత మనస్కుడు...ఆ విషయంలో ఆయనే ఛాంపియన్: పేర్ని నాని

సొంత తమ్ముడి చేత నాలుగు రిచ్‌ లలో ఇసుక దందాలు చేయిస్తూ దీని గురించి మాట్లాడిన ఎస్పీలను బదీలీలు చేయించారని చెవిరెడ్డిని విమర్శించారు.  అంతేకాకుండా మాట విని సలాం చేసే ఎస్పీని త్రిపుర నుంచి డిప్యుటేషన్‌ మీద తీసుకువచ్చిన నీచ చరిత్ర ఆయనదని మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలను పట్టించుకోకుండా ఎర్ర చందనం స్మగ్గింగ్‌ చేసి జైలులో ఉన్న వారితో కాలక్షేపం చేసే వ్యక్తి చెవిరెడ్డి అని విమర్శించారు.  తుడా ఛైర్మన్‌ గా ఉన్నప్పుడు ఎన్ని అక్రమాలు చేశారో అక్కడ టీ కోట్టు నడుపుకున్న వాళ్లను అడిగినా చెబుతారన్నారు.  

తన కొడుకు చంద్రగిరిలో సీటు, తాను తిరుపతి రూరల్‌ లో పోటీ చేయడం కోసమే జగన్మోహన్‌ రెడ్డి చుట్టు ఉండే నాయకులను పిలిపించి గొప్పలు చెప్పు కోవడం కోసమే ఈ మీటింగ్‌ పెట్టారని అన్నారు. అధికారులు కూడా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని... అసలు రాజకీయాల గురించి ఏమి తెలుసని వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

తెలుగుజాతికి మచ్చ తెచ్చె విధంగా 16 నెలలు జైలులో ఉండటమే కాకుండా హర్వర్డ్‌ యూనివర్శటీలో  ఏ విధంగా ఆర్థిక నేరాలు చేశారో జగన్మోహన్‌ రెడ్డిని ఉదాహరణగా చూపిస్తున్నారని.... ఎఫ్‌ బీ ఐ వారికి కూడా ట్రైనింగ్‌ ఇస్తున్నారని ఆరోపించారు.  తెలుగుజాతి పరువు తీసిన జగన్ వద్ద పని చేస్తున్న ఇలాంటి వారు  తెలుగుజాతి గురించి మాట్లాడుతుండటం విడ్డూరంగా వుంటుందన్నారు. 

2లక్షల 75 వేల ఎకరాలు కొట్టేసిన రాష్ట్రంలో 11 చార్జీ షీట్లు, 5 ఈడీ కేసులల్లో ఏ-1 ముద్దాయిగా ఉన్న జగన్మోహన్‌ రెడ్డి దగ్గర పని చేస్తూ రియల్‌ ఎస్టేట్‌ గురించి   మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో 11.3 శాతం ఉన్న జీడీపీ ఈ రోజు 5శాతం పడిపోయినా.... రూ. లక్ష 80వేల కోట్లు పెట్టుబడులు జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత వెళ్లిపోయినా కనీసం ఒక్కరు కూడా నోరుమెదపలేకపోయారని విమర్శించారు.

read more  నారావారిపల్లెలో వైసీపీ సభ: చంద్రబాబు స్పందన ఇదీ

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిధులు దారి మళ్ళిచి సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న జగన్మోహన్‌ రెడ్డి గురించి గొప్పగా మాట్లాడుతున్నారా? అని నిలదీశారు. వైజాగ్‌ ను లూటీ చేయటేమే జగన్ సిద్దాంతమని తెలియదా? అంటూ చెవిరెడ్డిపై అనురాధ విరుచుకుపడ్డారు.

 మీటింగ్‌ పెట్టాల్సింది రంగపేటలో కాదు శ్రీసీటీలో 

తిరుపతిలో చంద్రబాబునాయుడు ఎక్కడయితే రూ.90కోట్లు ఖర్చు చేశారో.. ఎక్కడైతే హీరో మోటార్స్‌ తీసుకోచ్చారో..అపోలో టైర్లు ఎక్కడైతే తీసుకువచ్చారో అక్కడ మీటింగ్‌ లు పెట్టాల్సిందని సూచించారు. దేశంలో 10 సెల్‌ ఫోన్‌ తయారు అవుతుంటే అందులో 3 చిత్తూరు జిల్లాలో తయారు అవుతున్నాయని గుర్తుచేశారు. 

ఇజుజా మోటార్స్‌, హీరో మోటార్స్‌, అపోలో టైర్స్‌, ఫ్యాక్‌ ఆన్‌ సెల్‌ కంపెనీ, సెల్కాన్‌ కంపెనీ, కార్బన్‌ సెన్‌ కంపెనీ, ఇలా సెల్‌ ఫోన్‌ కంపెనీలే కాకుండా రూ.90వేల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు చంద్రబాబునాయుడు కల్పించిన పరిస్థితి మీ కళ్లకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 

మంచి నీటి సౌకర్యం కోసం గండికోటకు రూ.2600 కోట్లు ఖర్చు పెట్టి ఈ రోజు అక్కడ తాగునీరుకు ఇబ్బంది లేకుండా చేసింది చంద్రబాబు నాయుడేనని కొనియాడారు.  రూ.414కోట్లు ఖర్చు పెట్టి 2444కిలో మీటర్ల వరకు సీసీ రోడ్లు చిత్తూరు జిల్లాలో లోకేష్‌ వేయించడం జరిగిందన్నారు. ఆ రోడ్లపైనే వైసీపీ నాయకులు తిరుగుతూ దుష్పాలాడుతారా? అని విమర్శించారు. 

చిత్తూరు జిల్లాలో తొందరలో చెవిరెడ్డి బాస్కర్‌ రెడ్డి చెవిని మెళిపెట్టమే కాకుండా అక్రమంగా సంపాందించిన సోమ్ము కక్కించి జైలు ఉసాలు లెక్కపెట్టించే రోజు కూడా దగ్గరలోనే ఉందన్నారు. చంద్రన్న భీమా, రూ. 5 భోజనం పెట్టలేని ఈ ప్రభుత్వాన్ని అధికారులు వెనుక వేసుకోకురావడం ఏంటో మాకు అర్ధం కావడం లేదన్నారు.    నేరగాడిని వెనకవేసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు కూడా ఈ లోకం దృష్టిలో.. రాష్ట్ర ప్రజల దృష్టిలో నేరగాల్లే అనే విషయాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలని అనురాధ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios