తిరుమల శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. 270వ మెట్టు దగ్గర చిరుత.. దుప్పిపై దాడి చేసి చంపింది. మెట్లు మొత్తం పూర్తిగా రక్తంతో నిండిపోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఉదయం 6 గంటల సమయంలో దుప్పి మృతదేహాన్ని గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు శ్రీవారి మెట్టు మార్గంలో భద్రతను పెంచారు. అయితే ఇది చిరుత పనా.. రేస్ కుక్కల దాడా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.

మార్గంలో సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం వరకు మూసివేస్తూ ఉంటారు. ఈ సమయంలో భక్తులెవ్వరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భక్తులు ఈ మార్గంలో దర్శనానికి వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు సూచించారు. 

Also Read:

వేంపెంటలో చిరుత కలకలం: గస్తీ తిరుగుతున్న గ్రామస్తులు

శ్రీశైలం ఆలయ సమీపంలో చిరుత సంచారం... భక్తుల్లో ఆందోళన