శ్రీశైలం ఆలయ సమీపంలో చిరుత సంచారం... భక్తుల్లో ఆందోళన
చిరుత సంచారంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, రింగ్ రోడ్డువైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కాగా... ఇప్పటికే ఆలయ అధికారులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
శ్రీశైలం దేవస్థానం సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. దేవస్థానం ఔటర్ రింగ్ రోడ్డులో ఓ చిరుతపులి సంచరించడాన్ని స్థానికులు గుర్తించారు. కాగా.. చిరుతపులిని చూసిన భక్తులు ఒక్కసారి ఆందోళన పడ్డారు. తమ సెల్ ఫోన్ లో చిరుత సంచరిస్తూ ఉండటాన్ని చిత్రీకరించారు. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.
చిరుత సంచారంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని, రింగ్ రోడ్డువైపు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటవీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. కాగా... ఇప్పటికే ఆలయ అధికారులు... అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు మరికాసేపట్లో చిరుత కోసం గాలించి.. పట్టుకునే అవకాశం ఉంది. పక్కనే ఉన్న అడవి నుంచి అనుకోకుండా తప్పిపోయి ఇటు వచ్చి ఉంటుందని భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.