చిత్తూరు: జిల్లా సబ్ కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతిస్పందన కార్యక్రమంలో ఓ యువకుడు వింతైన అర్జీ పెట్టుకున్నాడు. యువ ఐఎఎస్ అధికారిణి, మదనపల్లె సబ్ కలెక్టరు చెరుకూరి కీర్తి ముందే పేక ముక్కలతో తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించి...చివరకు తన ఆలోచనను ఆమెకు తెలియజేశాడు. అతడి మాటలు విన్న సబ్ కలెక్టర్ మొదట   అవాక్కయి ఆ తర్వాత అతన్ని సముదాయించే ప్రయత్నం చేశారు.

వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా కురబలకోట మండలానికి చెందిన కొమ్మద్ది బావాజీ(24), ఆరో తరగతి చదువుతున్నాడు. ఇతనితో పాటు ముగ్గురు చెల్లెలు ఒక తమ్ముడు ఉన్నారు. పేద కుటుంబంలో పుట్టిన బావాజీ 12వ ఏటనే జూదం ఆడటం నేర్చుకున్నాడు. లోపల, బయట జూదం ఆడుతూ పన్నెండేళ్లలో ప్రావీణ్యం సాధించారు. అది ఎంతగా అంటే ప్లేయింగ్ కార్డ్స్(పేక ముక్కలు) చూడగానే ఆ కార్డు ఏమిటో కచ్చితంగా చెప్తున్నాడు. ఇదే ప్రావీణ్యం జూదంలో ప్రదర్శిస్తూ లెక్కకు మించి డబ్బు సంపాదించానని అంటున్నాడు. 

read more  ''నేను ఉన్నాను...నేను విన్నాను'' డైలాగ్ జగన్ వీరికోసమే వాడారు...: హోంమంత్రి

అతనికి తిండి, నిద్ర , పేకాట తప్ప వేరే ప్రపంచం తెలియదు.  ఒక్కోరోజు లక్ష రూపాయలకు పైగా సంపాయించానంటున్నాడు.  దాని నుంచే తన చెల్లెలికి పెళ్లి కూడా చేశాను అంటున్నాడు. కానీ  ఇకపై జూదంలో సంపాదించిన డబ్బులు తనకు వద్దని, తనకు ఏదైనా గుర్తింపు కావాలని సబ్ కలెక్టర్ విన్నవించాడు. ఆరో తరగతి చదివిన తాను ఏ పని చేయలేనని,  బతకాలి అనే ఆలోచన కూడా తనకు లేదని... తన అవయవాలు దానం చేస్తానని సబ్ కలెక్టర్ కు అర్జీ పెట్టాడు. 

"

దానికి ఉదాహరణగా కసబ్ ను చెప్పుకొచ్చాడు. దీంతో విస్తుపోయిన సబ్ కలెక్టర్ కీర్తి బావాజి తో మాట్లాడుతూ... తెలివిగల యువకులు విపరీత ధోరణితో ఆలోచించకూడదని, మంచిగా చదువుకుంటే ప్రభుత్వం నుంచి సహాయం చేస్తామని తెలియచేసారు. అయినా బావాజీ మాత్రం తన అవయవదానం ఆలోచనను మనడం లేదు.

read more  ఉగ్రవాదుల టార్గెట్ ...ప్రధాని మోదీ, కెప్టెన్ విరాట్ కోహ్లీ

తాను జీవితంలో సంపాదించిన డబ్బు అంతా ఒకరి వద్దనుంచి గెలుచుకున్నదేనని తనకు ఆ డబ్బు వద్దని, చదువు సంధ్య లేని తాను వేరే ఏ పని చేయలేనని వాపోతున్నాడు. తన వల్ల ఓడిపోయిన కుటుంబాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మారాలనుకుంటున్నాడు. ఏ పనీ చేయలేని తాను ఈ సమాజానికి ఏదైనా కొంచెం చేయాలని ఆశిస్తున్నానంటున్నాడు.