ఏపీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి మృతి: ఎన్టీఆర్‌పై పోటీతో సంచలనం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ అగరాల ఈశ్వర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తిరుపతిలోని స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు.
చిత్తూరు జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. చిత్తూరు జిల్లా తూకివాకం గ్రామానికి చెందిన ఆయన 1957-62 మధ్య కాలంలో తూకివాకం గ్రామ సర్పంచిగా పనిచేశారు.
Also Read:మంత్రి వనిత సంతకం ఫోర్జరీ కేసులో మరో ట్విస్టు: నిందితుడు పరార్... అనుచరుడు ఆత్మహత్యాయత్నం
తదనంతరం కాలంలో 1962లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1967లో మరోసారి ప్రయత్నించి శాసనసభకు ఎన్నికయ్యారు. 1978లో రెండోసారి గెలుపొందిన ఆయన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, చివరిలో కొంతకాలం స్పీకర్‌గా వ్యవహరించారు.1983లో ప్రముఖ సినీనటుడు నందమూరి తారక రామారావుపై తిరుపతిలో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆయన పేరు అప్పట్లో బాగా మారుమోగింది.
కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానుల వ్యవహారంపై అగరాల స్పందించారు. అమరావతి కోసం చంద్రబాబు జోలె పట్టడం సిగ్గుచేటన్నారు. జగన్ మంచి ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తున్నారని ఈశ్వర్ రెడ్డి ప్రశంసించారు.
Also Read:బీజేపీతో వైసీపీ జత కలిస్తే జనసేన కటీఫ్: తేల్చేసిన పవన్
కర్నూలులో హైకోర్టు, విశాఖలో రాజధాని ఉండటం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుందని అగరాల అభిప్రాయపడ్డారు. ఈశ్వర్ రెడ్డి మరణం పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు.